గంభీరం జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్: మూడు కార్ల ఢీ

6చూసినవారు
గంభీరం జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్: మూడు కార్ల ఢీ
విశాఖపట్నం సమీపంలోని గంభీరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం మూడు కార్లు పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాలు రోడ్డు మధ్యలోనే నిలిచిపోవడంతో హైవేపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్