విశాఖలో క్రవారం ఉదయం జోడిగుడ్లపాలెం నుంచి ఐదుగురు వ్యక్తులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లిన గరికిన నూకరాజు, తెప్పపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. సముద్రం మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఒడ్డుకు చేరుకున్న తోటి మత్స్యకారులు ఈ విషయాన్ని ఆరిలోవ పోలీసులకు తెలియజేశారు. మధ్యాహ్నం సమయంలో నూకరాజు మృతదేహం లభ్యమైంది. మృతుడి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.