
సంక్రాంతికి విశాఖ-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని, విశాఖ, విజయవాడ మధ్య జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీలలో ప్రత్యేక రైలు (08567/68) నడపనున్నట్లు DRM లలిత్ బోహ్ర ఆదివారం తెలిపారు. ఈ రైలు విశాఖలో ఉదయం 10.08 గంటలకు బయలుదేరి విజయవాడ సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది.





































