కారు - లారీ ఢీ.. ఒకరు మృతి

2209చూసినవారు
కారు - లారీ ఢీ.. ఒకరు మృతి
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం సీహెచ్ అగ్రహారం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న విశాఖపట్నం పిఎం పాలెం కు చెందిన ఉమామహేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి విజయనగరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్