జాషువా జయంతి వేడుకలు, వైద్య శిబిరం నిర్వహణ

1చూసినవారు
జాషువా జయంతి వేడుకలు, వైద్య శిబిరం నిర్వహణ
పశ్చిమ విశాఖలోని కంచరపాలెం మెట్టు, జాషువా నగర్ వద్ద సోమవారం నవయుగ మహాకవి శ్రీ గుఱ్ఱం జాషువా 131వ జయంతి మహోత్సవ కార్యక్రమం జాషువా కమిటీ అధ్యక్షులు అలమండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అనంతరం మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన ఉత్తర నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, గ్రేటర్ విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గొట్టివాడ నర్సింగరావు, ప్రవీణ్, అచ్చి బాబు, ఆదినారాయణమూర్తి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్