ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాచలం–సత్తారువు రోడ్డులో సోమవారం రాత్రి కారు, బుల్లెట్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరి ఎడమ కాలు తెగిపోయింది. మిగిలిన ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.