విశాఖ: KGHలో నిర్లక్ష్యంపై మహిళ ఫిర్యాదు.. స్పందించిన పవన్ కళ్యాణ్

753చూసినవారు
విశాఖ: KGHలో నిర్లక్ష్యంపై మహిళ ఫిర్యాదు.. స్పందించిన పవన్ కళ్యాణ్
విశాఖలోని KGH వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువును కోల్పోయానంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై DY CM పవన్ కళ్యాణ్ స్పందించారు. శుక్రవారం విశాఖలో పట్నాల ఉమాదేవి అనే మహిళ ఆయనను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పవన్ ఆమెకు హామీ ఇచ్చారు. సోమవారం బాధిత కుటుంబాన్ని సచివాలయంలోని తన కార్యాలయానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్