యలమంచిలి పట్టణంలో గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్థానిక స్వరఝరి సంగీత సంస్థ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతీయ సంగీత రంగానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలను, ఆయన తీపి జ్ఞాపకాలను నిర్వాహకులు స్మరించుకున్నారు.