అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల
ఫలితాలు వెలువడ్డాయి. వార్డు నెంబర్ 8లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎడారి భాగ్యశ్రీ 478 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. భాగ్యశ్రీకి 605 ఓట్లు రాగా, ప్రత్యర్థి వైయస్సార్సీపీ అభ్యర్థికి 127 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఈ విజయం అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ నుంచి భాగ్యశ్రీ తన గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.