అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యలమంచిలి తహశీల్దార్ వరహాలు బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 23, 24వ తేదీల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున యలమంచిలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యలమంచిలి ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.