సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ‘ఆల్ఫా’

7007చూసినవారు
సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ‘ఆల్ఫా’
శివ్‌ రావైల్‌ దర్శకత్వంలో అలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్‌ చిత్రం ‘ఆల్ఫా’ జులై 3న విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేస్తూ, ద్వితీయార్ధంలోని కొన్ని సన్నివేశాల తీవ్రతను తగ్గించి, ప్రత్యామ్నాయ దృశ్యాలు పెట్టాలని, ప్రథమార్ధంలోని ఓ డైలాగ్‌ను తొలగించి, రెండు సంఘటనల విజువల్స్‌ను తగ్గించాలని సూచించింది. మద్యం సన్నివేశాల్లో గమనిక, పాటలకు సబ్‌టైటిల్స్, చైల్డ్ ఆర్టిస్ట్ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది.

సంబంధిత పోస్ట్