AP: కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో రూ.10 కోట్లతో నూతన భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాలేజీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలి. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తే ప్రైవేటీకరణ అవసరమే ఉండదు. ఈ కాలేజీ కాకినాడకు ఒక గొప్ప ల్యాండ్‌మార్క్ అవుతుంది. మనం కాలేజీని వదిలి వెళ్లినా.. మన ఆలోచనలు, గుండెల్లో కాలేజీని ఎప్పటికీ వదలలేం’ అని అన్నారు.