AP: అమరావతి ఏపీ రాజధానిగా శాశ్వతం కాదని న్యాయవాది జీవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా రాజధానిని మార్చే అధికారం ఉందని, దీనికి రాజ్యాంగ సవరణ ఒక్కటే శాశ్వత పరిష్కారమని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రాజధానుల మార్పు లేదని, ఏపీలో మాత్రం వింత పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఉభయ సభలతో పాటు సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరమని తెలిపారు.