AP: అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని మంత్రి
లోకేశ్ స్పష్టం చేశారు. వర్షాల కారణంగా అమరావతి మునిగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్లు, ఎమ్మెల్యే-ఎంఎల్సీ టవర్లు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని వివరిస్తూ వీడియోను ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేశారు. రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు ఇకపై ఎలాంటి విరామం ఉండదని, అమరావతిపై తప్పుడు ప్రచారాలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు.