ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి అమరావతి క్వాంటం వ్యాలీ (AQV) స్థాపన కోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కింద అమరావతిలోని క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ లో కీలక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.