AP: రాజధాని అమరావతిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, రాష్ట్రంతోపాటు అందరం కలిసి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అమరావతి అంటే గన్నవరం, విజయవాడ, గుంటూరు, తాడికొండలు మాత్రమే కాదని, ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతిరూపమన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోందన్నారు. ఈ విషయంలో అనవసర వివాదాలను సృష్టించొద్దని కోరారు.