ఏపీలో అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 7గ్రామాల్లో 16,666 ఎకరాల భూ సమీకరణకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించారు. అమరావతి మండలంలోని 4, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో ఈ భూ సమీకరణ జరగనుంది. గత జూన్ 24న మంత్రివర్గంలో రెండో విడత భూ సమీకరణకు ఆమోదం లభించింది. అయితే, మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు హామీలు నెరవేర్చలేదని, ప్లాట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.