AP; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధిని 'అన్‌స్టాపబుల్' అని అభివర్ణించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమరావతిలోనే నిర్వహించుకుంటున్నామని, కూటమి ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2047 నాటికి అమరావతిని ప్రపంచస్థాయి ఆర్థిక, సాంకేతిక రాజధానిగా తీర్చిదిద్దడంతో పాటు ఏపీని స్వర్ణాంధ్రగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలతో రాజధాని నిర్మాణంలో తొలి అడుగు పడిందని, 190 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు, 96 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు.