ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి అన్నారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ విభజన ప్రక్రియ అరాచకంగా, చర్చ లేకుండానే జరిగిందని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ పాలన ప్రారంభమైందని, 29వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని, త్యాగం చేసిన రైతుల పట్ల గత ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని పురందేశ్వరి ఆరోపించారు.