అమరావతి పనులు వేగవంతం: మంత్రి నారాయణ (వీడియో)

37చూసినవారు
AP: రాజధాని అమరావతిలో అభివృద్ధి, నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. 30 శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, 133.3 కి.మీ. పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. రాజధాని రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. సీఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.

ట్యాగ్స్ :