పోలవరంపై అబద్ధాలు ఆడుతున్నారు: అమర్‌నాథ్

41చూసినవారు
పోలవరంపై అబద్ధాలు ఆడుతున్నారు: అమర్‌నాథ్
AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మరో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు తెరలేపారని, పోలవరం నీళ్లు వస్తున్నాయని అబద్ధాలు ఆడుతూ ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కాకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు విడుదల చేస్తున్నారని, చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు తెచ్చిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పాలని అమర్‌నాథ్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్