జూలై 3న, శుక్రవారం తెల్లవారుజామున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. 57 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. భక్తులు నున్వాన్-పహల్గామ్ (48 కి.మీ), బాల్తాల్ (14 కి.మీ) మార్గాల ద్వారా అమర్‌నాథ్ గుహకు చేరుకుంటారు. వేలాది మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నిఘా కూడా కొనసాగుతుంది. అధికారులు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.