అమర్‌నాథ్ యాత్ర గురువారం నుంచి వైభవంగా ప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది యాత్ర జులై 03 నుండి ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగుతుంది. భక్తులు పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర గుహకు చేరుకుంటారు. యాత్ర సురక్షితంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు, డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నారు. అధికారులు భక్తులందరూ మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.