పవిత్ర అమర్‌నాథ్ యాత్ర సోమవారం, జూలై 3న ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజే 10 వేల మందికి పైగా యాత్రికులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర
మోదీ యాత్రికులకు లేఖ రాస్తూ శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. భక్తులు పరిశుభ్రత పాటించడం, భద్రతా నిబంధనలు పాటించడం, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం, యాత్ర అనంతరం ఒక మొక్క నాటడం, దేశాభివృద్ధికి కృషి చేయడం అనే ఐదు సంకల్పాలు తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.