జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

11848చూసినవారు
పవిత్ర అమర్‌నాథ్ శైవ క్షేత్ర దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఏటా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే ఈ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభం కానుంది. 57 రోజులపాటు సాగే ఈ యాత్ర AUG 28 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం తొలి పూజ చేశారు. గుహలో కొలువైన మంచు లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం సైన్యం, పోలీసులు, భద్రతా దళాలు, వాలంటీర్లు పూర్తి సమన్వయంతో పని చేస్తారని సిన్హా చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్