ఫిబ్రవరి 17న మంగళవారం నాడు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. మ.3:26 గంటలకు ప్రారంభమై రా.7:57 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి, భారతీయులపై దీని ప్రభావం ఉండదని, యధావిధిగా పనులు చేసుకోవచ్చని, సూతకాలం కూడా వర్తించదని ఆధ్యాత్మిక నిపుణులు తెలిపారు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, జింబాబ్వే, మారిషస్, నమీబియా, టాంజానియా వంటి దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.