రోజుకు కేవలం 10 నిమిషాల యోగా సాధనతో జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. యోగా అనేది మనస్సు, శరీరాన్ని అనుసంధానిస్తుంది. ఉదయాన్నే యోగా చేయడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది, మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీర ఫ్లెక్సిబిలిటీ, ఇమ్యూనిటీ పెరుగుతాయి. గుండె, శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహాతోనే యోగా చేయాలి.