మధుమేహ రోగులకు మిల్లెట్స్ మేలు: వైద్యులు

8973చూసినవారు
మధుమేహ రోగులకు మిల్లెట్స్ మేలు: వైద్యులు
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చపాతీల కంటే మిల్లెట్స్ తో చేసిన ఆహారాలు మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. చిరుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి. సామలు, కొర్రలు, సజ్జలు వంటి మిల్లెట్స్ లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం పెరుగుతుంది, బరువు అదుపులో ఉంటుంది. వీటితో పాన్‌కేక్స్, కిచిడీ, ఉప్మా వంటివి తయారుచేసుకుని తీసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్