ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో RCB ఫీల్డర్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. SRHతో జరిగిన ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ బౌండరీ వైపు కొట్టిన బంతిని సాల్ట్ ఒంటి చేత్తో అందుకొని స్టన్నింగ్ క్యాచ్ సాధించాడు. దీంతో 38 బంతుల్లో 80 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. ఈ అద్భుత ఫీల్డింగ్‌కు ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయి ప్రశంసలు కురిపించారు.