మెంతులు రుచికోసమే కాకుండా అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, బరువు తగ్గుదలకు సహాయపడుతుంది. బాలింతలలో తల్లిపాలు పెంచడానికి, గర్భధారణ సమయంలో, ప్రసవానంతర సమస్యల నివారణకు, అధిక కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మధుమేహం నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయి.