అమెజాన్ సంస్థ తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మే నెలలో వివిధ విభాగాల్లోని సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఈ తొలగింపుల్లో కార్పొరేట్, మిడ్-లెవల్ మేనేజర్లు, మానవ వనరుల విభాగం వంటి
ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయి. గత ఏడాది అక్టోబరులో 14,000 మందిని, ఈ ఏడాది జనవరిలో 16,000 మందిని తొలగించిన అమెజాన్, ఇప్పుడు మరోసారి ఉద్యోగుల కోతకు సిద్ధమైంది.