అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీ?

174చూసినవారు
అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీ?
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక రాజకీయాల్లోకి రానున్నట్లు  ప్రచారం జరుగుతోంది. ఇటీవల అంబటి ఇంటిపై జరిగిన దాడి తర్వాత మౌనిక బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన మాట తీరు, పద్ధతి, విధానం, రియాక్ట్ కావడం వంటివి చక్కగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంబటి మౌనిక కనుక రాజకీయాల్లోకి వస్తే... ఒకింత ఆశించిన మేరకు వైసీపీ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్