హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు భార్య

1289చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు భార్య
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన సతీమణి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆమె హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాడేపల్లిలో తనను, తనతో ఉన్నవారిని అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని, తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విజయలక్ష్మి పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించనుంది.

సంబంధిత పోస్ట్