AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడంపై ప్రశ్నించారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన సీఐఐ సమ్మిట్‌లో మన చిన్న కమ్మ పవన్ కళ్యాణ్ కనిపించలేదేంటబ్బ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రి లోకేశ్‌ను ట్యాగ్ చేశారు.