AP: మాజీ మంత్రి,
వైసీపీ నేత అంబటి రాంబాబు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద భావోద్వేగంగా ప్రతిజ్ఞ చేశారు. వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన ఆయన, "సాధ్యపడని అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యం. ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతామని ఈ పవిత్ర స్థలంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని ప్రకటించారు.