AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. కళాకారులు, మహిళలతో కలిసి ఆయన సరదాగా రెండు స్టెప్పులేశారు. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. గతంలో తాను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే.. సంబరాల రాంబాబు అని విమర్శించారన్నారు. మరి పవన్ డాన్స్ వేస్తే ఏంటని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.