మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు వచ్చిన నేతలను ఒక్క దెబ్బకు కనుమరుగు చేయగలనంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఆర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవని పేర్కొంది. ప్రజల్ని ట్రంప్ చంపగలరేమో కానీ ఆదర్శాలు, ఆశయాలను అంతం చేయలేరని తేల్చి చెప్పింది.