అమిత్ షాకు కేంద్ర కేబినెట్‌లో పెద్ద పీట.. బీజేపీలో చర్చ

11212చూసినవారు
అమిత్ షాకు కేంద్ర కేబినెట్‌లో పెద్ద పీట.. బీజేపీలో చర్చ
నరేంద్ర మోడీ తరువాత కేంద్రంలో అతి ముఖ్య నాయకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపిస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కీలక భూమిక పోషించి, పార్టీ విజయాలకు కృషి చేశారు. 2019 తరువాత కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఏడేళ్లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అమిత్ షాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనకు ప్రభుత్వంలో పెద్ద పీట దక్కుతుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్