నాగర్‌కర్నూల్‌జిల్లా అమ్రాబాద్ టైగర్ సఫారీని వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం దృష్ట్యా జులై 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు మూడు నెలల పాటు నిలిపివేయనున్నారు. నల్లమలలో సఫారీ టూర్‌ను అధికారులు బంద్‌పెట్టారు. హైదరాబాద్– -శ్రీశైలం ప్రధాన రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శ్రీశైలం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆలయాల దర్శనానికి యాత్రికులు వస్తుంటారు. వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నల్లమలలోకి ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.