సోషల్ మీడియా కార్యకర్తల గొంతు నొక్కేందుకు ఐటీ చట్టాన్ని సవరించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసారని వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, మాజీ అదిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అయితే ఆ సిఫార్సులు కోర్టుల్లో నిలవవు అని, కేంద్రానికి మాత్రమే చట్ట సవరణ అధికారమని, చంద్రబాబు ప్రభుత్వం అవివేకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా ఎన్నికలకు ముందే వైసీపీపై విషప్రచారం జరిగిందని, బీఎన్ఎస్ సెక్షన్ 111తో అక్రమంగా కేసులు పెట్టి జీవితం నాశనం చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపించారు.