బిహార్ లోని వైశాలి జిల్లాలో దారుణం జరిగింది. శ్మశానవాటికకు వెళ్లే దారి ఆక్రమణకు గురికావడంతో, ఒక వృద్ధురాలి మృతదేహానికి కుటుంబ సభ్యులు నడిరోడ్డుపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. స్థానిక వ్యాపారుల ఆక్రమణల వల్ల దారి మూసుకుపోవడంతో వేరే మార్గం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. కనీసం చనిపోయిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు లభించకపోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యుక్తమవుతున్నాయి.