ఒక్క ఓటుతో సరిపెట్టుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థి

44చూసినవారు
ఒక్క ఓటుతో సరిపెట్టుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థి
AP:  విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 7వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్ల రామకృష్ణకు కేవలం ఒకే ఒక్క ఓటు లభించింది. ఈ వార్డులో మొత్తం 856 ఓట్లు పోల్ అవ్వగా, టీడీపీ అభ్యర్థి బొడ్డేటి చందర్రావు విజయం సాధించారు. టీడీపీకి 448 ఓట్లు, వైసీపీకి 374 ఓట్లు రాగా, కాంగ్రెస్, నోటాకు తలో 6 ఓట్లు వచ్చాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్