మూడు ముళ్లతో ఒక్కటైన ఐపీఎస్ జంట

2967చూసినవారు
మూడు ముళ్లతో ఒక్కటైన ఐపీఎస్ జంట
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారులు, బరేలీ ఏఎస్పీ అన్షికా వర్మ, సంభాల్ ఎస్పీ కేకే బిష్ణోయ్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని అజిత్ ప్యాలెస్‌లో వైభవంగా వివాహం చేసుకున్నారు. బిష్ణోయ్ మోకాలిపై కూర్చుని అన్షికా వర్మకు పూలమాల వేయడం, కైలాష్ ఖేర్ పాడిన 'ఓ రీ సఖీ మంగళ్ గావ్ రీ' పాటతో వివాహ వేడుక సినిమాటిక్‌గా మారింది. ఎరుపు రంగు లెహంగాలో అన్షికా, ఆఫ్ వైట్ షేర్వానీలో కేకే బిష్ణోయ్ ఆకట్టుకున్నారు. బిష్ణోయ్ రేంజ్ రోవర్‌లో వచ్చి, గుర్రంపై స్వారీ చేసిన తీరు, పెళ్లి బృందం నృత్యాలతో వేడుక రాత్రంతా కొనసాగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్