
పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే సర్పంచ్ మృతి
TG: సంగారెడ్డి జిల్లాలో కొత్త సర్పంచ్ కన్నుమూశారు. న్యాల్కల్ మండలం మిర్జాపూర్(ఎన్) సర్పంచ్ అక్కమ్మ (58) అనారోగ్యంతో మృతి చెందారు. అక్కమ్మ మూడో విడత ఎన్నికల్లో 141 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ మద్దతుదారుగా పోటీ చేసి గెలిచారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




