
నర్సీపట్నం టౌన్ పోలీస్ వారి హెచ్చరిక
నర్సీపట్నం టౌన్ సీఐ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆటోలో మైక్ ఏర్పాటు చేసి తోపుడు బండ్ల వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాల యజమానులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్కు అంతరాయం కల్పించే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.







































