అనకాపల్లి అనే వ్యక్తి తన ఊరి పేరునే తన పేరుగా పెట్టుకున్నాడు. అచ్యుతాపురం మండలం లంకధర్మవరానికి చెందిన 58 ఏళ్ల తోకల అనకాపల్లి, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు తన పేరు అనకాపల్లి అని చెబితే, ఊరి పేరు కాదని, తన అసలు పేరు చెప్పమని అడుగుతుంటారు. ఆధార్ కార్డు చూపిస్తేనే నమ్మే పరిస్థితి నెలకొంది. చిన్నతనంలో ఒక వృద్ధురాలు 'అనకాపల్లి' అని పిలవడంతో తల్లిదండ్రులు ఆ పేరునే కొనసాగించారు. మరో తమ్ముడు పుట్టాడని సెంటిమెంట్‌గా చెబుతున్నాడు.