అచ్యుతపురం మండలం నరపాక జంక్షన్‌లో టిప్పర్ ఢీకొనడంతో కొల్లి వరహాలు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. పెళ్లి కార్యక్రమం సందర్భంగా రోడ్డు పక్కన నిలుచున్న ఆయనను అచ్యుతపురం వైపు నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరహాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ వాహనంతో పరార్ అయ్యాడని వారు చెప్పారు.