అనకాపల్లి: అరకు కాఫీకి “చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

975చూసినవారు
అనకాపల్లి: అరకు కాఫీకి “చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు
అనకాపల్లి ఏం పి సీఎం రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అరకు వ్యాలీ కాఫీ ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో అవార్డు సాధించడం గిరిజన సమాజానికి గర్వకారణమని, ఇది శుభ పరిణామమని ఆయన అన్నారు. గిరిజన రైతుల కృషితో అరకు కాఫీ బలమైన సామాజిక స్థానం సాధించిందని, జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన రైతుల శ్రమ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం ఆనందదాయకమని, అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్