అనకాపల్లి: బావిలో పడి బాలుడు మృతి

474చూసినవారు
అనకాపల్లి: బావిలో పడి బాలుడు మృతి
అనకాపల్లి పట్టణంలోని లక్ష్మీదేవిపేట శివారులోని పొలాల్లోని బావిలో పడి కర్రి నవదీప్ (10) అనే బాలుడు మృతిచెందాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు పొలం పనులు చేస్తుండగా, సమీప బావి వద్దకు వెళ్లిన నవదీప్, దానిపై నుంచి తాటిచెక్కను దాటుతూ నీటిలో పడిపోయాడు. నీటిలో మునిగిపోవడంతో మృతిచెందినట్లు స్థానికులు బయటకు తీసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. బతుకుదెరువు కోసం అనకాపల్లి వచ్చి కూలి పనులు చేసుకుంటున్న కర్రి శివ, సంతోషి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్