ప్రశ్నిస్తే దాడి చేస్తారా అంటూ సీఎం చంద్రబాబును
వైసీపీ ప్రశ్నించింది. నర్సీపట్నం
వైసీపీ సమన్వయకర్త పెట్ల ఉమా శంకర్ గణేశ్‌పై జరిగిన దాడిని
జగన్ ఖండించినట్లు
వైసీపీ బుధవారం 'X'లో పేర్కొంది. ఏపీ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నర్సీపట్నంలో మట్టి తరలించింది మీరు, దీనిపై ప్రశ్నిస్తే దాడులు చేయడం అమానుషం అన్నారు. ఉమా శంకర్ గణేశ్‌పై దాడులకు తెగబడిన అయ్యన్న అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.